Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ రహస్య పర్యటన.. పూజలు!

  • చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు
  • చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకం నిర్వహణ
  • వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయిన తండ్రీకొడుకులు
ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞలు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. ఇక్కడి పుల్లేటికుర్రు గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వీరిద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

   కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామి వారికి చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకంలో బాలకృష్ణ, మోక్షజ్ఞలు పాల్గొన్నారు. అయితే ఈ పర్యటన మొత్తం గోప్యంగా సాగింది. పూజల అనంతరం బాలకృష్ణ, మోక్షజ్ఞలు వేర్వేరు వాహనాల్లో  వెళ్లిపోయారు. కాగా, బాలకృష్ణ తర్వాతి చిత్రానికి సంబంధించి ఈ పూజలు చేసినట్లు నాగమల్లేశ్వర సిద్ధాంతి తెలిపారు.
Andhra Pradesh
East Godavari District
Balakrishna
mokshgnaa
pooja
Telugudesam

More Telugu News