valmiki movie: వరుణ్‌తేజ్ సినిమా ‘వాల్మీకి’ పేరును మార్చాల్సిందే: హెచ్చరించిన ఆర్.కృష్ణయ్య

మెగాహీరో వరుణ్‌తేజ్ సినిమా వాల్మీకి పేరును మార్చాల్సిందేనని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వాల్మీకి పేరుతో తీసే సినిమాలో ఆధ్యాత్మికత ఉండాలని, కానీ ఓ గ్యాంగ్‌స్టర్ సినిమాకు వాల్మీకి పేరు పెట్టడం దుర్మార్గమన్నారు.

 శుక్రవారం ఇందిరాపార్క్‌లో బోయహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సినిమా టైటిల్ మార్చాలంటూ వాల్మీకి బోయలు మహాధర్నా నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జేఏసీ కన్వీనర్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తదితరులు హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  సినిమా పేరును మార్చాలంటూ ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పేరు మార్చకుంటే సినిమా యూనిట్‌పై కేసులు పెట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
valmiki movie
varuntej
Tollywood
R.krishnaiah

More Telugu News