Bihar: వరద నీటిలో టిక్‌టాక్ చేయబోయి.. ఉద్ధృతికి కొట్టుకుపోయిన యువకుడు!

షార్ట్స్‌లో చూడండి
ఉద్యోగాలు ఊడుతున్నా, ప్రాణాలు పోతున్నా టిక్‌టాక్ పిచ్చి మాత్రం జనాల్లో తగ్గట్లేదు. ఈ పిచ్చితో లైక్‌లు తెచ్చుకోవాలనే ఆకాంక్షతో ఎలాంటి స్టంట్‌లకైనా యువత వెనుకాడట్లేదు. దీంతో కొందరు యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు వరద ఉద్ధృతిలో టిక్‌టాక్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. బీహార్‌‌లో వర్షం బీభత్సం కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే.

మూడు రోజుల క్రితం అద్దావ్‌పూర్‌కి చెందిన అఫ్జల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి టిక్‌టాక్ చేసేందుకు వరద నీటి వద్దకు వెళ్లాడు. మొదట అప్జల్ స్నేహితుడు నీటిలో డైవ్ చేయగా, ఆ తరువాత అఫ్జల్ కూడా దూకాడు. అయితే, వరద ఉద్ధృతి కారణంగా అప్జల్ కొట్టుకుపోయాడు. వెంటనే అతడి స్నేహితుడు అధికారులకు సమాచారం ఇవ్వగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. నేడు సహాయక సిబ్బందికి అప్జల్ మృతదేహం దొరికింది.  
Go Back to Shorts
Bihar
TikTok
Water Flow
Afzal
Friends
NDRF

More Telugu News