Kumaraswamy: కుమారస్వామి రాజీనామాను తట్టుకోలేక తోటను ధ్వంసం చేసుకున్న రైతు

షార్ట్స్‌లో చూడండి
సినీ నటులకు ఉన్నట్టే రాజకీయ నాయకులకు వీరాభిమానులు ఉంటారు. తమ నాయకుడికి ఏదైనా కష్టం వస్తే తమకే వచ్చినట్టుగా బాధపడుతుంటారు. కర్ణాటకలో కుమారస్వామి విషయంలోనూ ఇదే జరిగింది. విశ్వాస పరీక్షలో ఆయన ఓటమిని జీర్ణించుకోలేని ఓ రైతు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది.

విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమిపాలై తన సీఎం పదవికి రాజీనామా చేయడాన్ని భరించలేని ఓ రైతు తన ఎకరం పొలంలోని సర్వే తోటను నరికేశాడు. అనంతరం దానిని వీడియో తీసి చూపిస్తూ, కుమారస్వామి రాజీనామా తనను ఎంతలా కుంగదీసిందో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమారస్వామి అభిమానులెవరూ ఇలాంటి నిర్ణయాలతో ఆయనను మరింత బాధ పెట్టవద్దని కొందరు అభిమానులు, నేతలు సూచిస్తున్నారు.
Go Back to Shorts
Kumaraswamy
Karnataka
Former
Distroyed
Video
Social Media

More Telugu News