Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాసిన కన్నా లక్ష్మీనారాయణ!
ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణాల పేదలకు తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ యువతకు వరంగా మారిందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కానీ ఇది ఏపీలో ఇంకా అమలు కావడం లేదన్నారు. దీనివల్ల చాలామంది యువత అవకాశాలు కోల్పోతున్నారనీ, తద్వారా నిరాశకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించాలని కన్నా డిమాండ్ చేశారు. ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ చట్టం అమలు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ రాశారు.