Andhra Pradesh: టీడీపీకి గుడ్ బై.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న భూమా కిషోర్ రెడ్డి!

  • కర్నూలు జిల్లాలో బీజేపీ కార్యక్రమం
  • పార్టీలో చేరిన భూమా కిషోర్ రెడ్డి, మహేశ్ రెడ్డి
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జేపీ నడ్డా
టీడీపీ నుంచి రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ నేత భూమా అఖిలప్రియ కుటుంబీకులు భూమా కిషోర్ రెడ్డి, మహేశ్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కర్నూలులో జరిగిన కార్యక్రమంలో వీరు పార్టీలో చేరారు.

వీరికి కండువా కప్పిన జేపీ నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని కాపాడుకునేందుకే బీజేపీలో చేరినట్లు ప్రకటించారు.  
Andhra Pradesh
Telugudesam
BJP
bhuma
family

More Telugu News