Anand Devarakonda: అందుకే హీరోగా రావడానికి ధైర్యం చేశాను: హీరో ఆనంద్ దేవరకొండ

  • జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చాను
  •  నాన్న, అన్నయ్య సపోర్ట్ చేశారు 
  • తొలి సక్సెస్ నమ్మకాన్ని పెంచింది
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించడంతో ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."నేను మంచి జాబ్ వదులుకుని సినిమాల్లోకి వచ్చాను. నాకు సక్సెస్ రాకపోతే .. ఆడియన్స్ ఆదరించకపోతే ఆ తరువాత ఏం చేయాలనే ఒక ఆలోచన ఉండేది.

ఇప్పుడు కొత్త దర్శకులు ఎక్కువమంది వస్తున్నారు. కొత్త ఆర్టిస్టులను ప్రోత్సహిస్తున్నారు. అందువలన నాకంటూ చోటు ఉంటుంది అనే ఒక నమ్మకం ఏర్పడింది. ఇది నేను ప్రయోగం చేయవలసిన సమయమే అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో నాన్న .. అన్నయ్య ఇద్దరూ కూడా నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాను. 'దొరసాని' విజయం నాపై నాకు మరింత నమ్మకం కలిగేలా చేసింది" అని చెప్పుకొచ్చాడు.
Anand Devarakonda

More Telugu News