Andhra Pradesh: వైసీపీకి నాపై చాలా అభిమానం ఉన్నట్లుంది.. నాకే ఆశ్చర్యం వేస్తోంది!: చంద్రబాబు వ్యంగ్యం

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబు తన మాటలతో సభలో నవ్వులు పూయించారు. నదీ జలాల పంపకంపై చర్చ సందర్భంగా టీడీపీ తరఫున ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తొలుత మాట్లాడారు. తెలంగాణ భూభాగంలో నదీ జలాలను మళ్లిస్తే మన జుట్టు తెలంగాణ చేతిలో పెట్టినట్లేనని హెచ్చరించారు.

అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో చంద్రబాబు తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. చూస్తుంటే వైసీపీకి తనపై చాలా అభిమానం ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. అంత అభిమానం చూసి తనకే ఆశ్చర్యం వేస్తోందని చెప్పారు. చాలా మార్పు వచ్చిందనీ, దీనిపై చాలా సంతోషంగా ఉందని వ్యంగ్యంగా స్పందించారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ సహా సభ్యులంతా నవ్వుల్లో మునిగిపోయారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Chandrababu
funny comments

More Telugu News