Vijay devarakonda: బతుకు గురించిన భయం లేదు నాకు: హీరో విజయ్ దేవరకొండ

  • నేను స్టార్ డమ్ పట్టించుకోను 
  • డబ్బుకు పెద్దగా ప్రాధాన్యతనివ్వను 
  • సింపుల్ గా బతికేయగలనన్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన ధోరణి గురించి ప్రస్తావించాడు.

"నేను ఎవరనే విషయం ఎవరికీ తెలియని పరిస్థితి నుంచి ఈ స్థాయికి వచ్చాను. నా దగ్గరున్న డబ్బుతోనే సింపుల్ గా బతుకుతూ వచ్చాను. ప్రస్తుతం నా దగ్గరున్న డబ్బుతో చాలాకాలమే సింపుల్ గా బతికేయగలను. స్టార్ డమ్ చేజారిపోతుందనీ .. డబ్బు తరిగిపోతుందని నేను ఎప్పుడూ భయపడను. ఎందుకంటే నేను స్టార్ డమ్ ను పట్టించుకోను. డబ్బుకు పెద్దగా ప్రాధాన్యతనివ్వను. నా అభిమానులు నాతో వుంటే చాలని కోరుకుంటాను. అందువలన బతుకు గురించిన భయం ఎంతమాత్రం నాకు లేదు" అని ఆయన చెప్పుకొచ్చాడు.
Vijay devarakonda

More Telugu News