Nagarjuna: సరదాగా .. సందడిగా 'మన్మథుడు 2' ట్రైలర్

  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'మన్మథుడు 2'
  • దాదాపుగా విదేశాల్లోనే జరిగిన చిత్రీకరణ
  •  ఆగస్టు 9వ తేదీన విడుదల  
నాగార్జున కథానాయకుడిగా రూపొందిన 'మన్మథుడు 2' వచ్చేనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాగార్జున సరసన నాయికగా రకుల్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ కొంత వినోదభరితంగానూ, మరికొంత ఉద్వేగభరితంగాను సాగింది. "ఏ అమ్మాయ్ బాగానే వున్నావ్ గదా .. వీడ్ని చేసుకుంటున్నావేంటి?" అనే రావు రమేశ్ డైలాగ్, "నువ్వు ఒంటరిగా ఉండటమే కరెక్ట్ .. నీతో ఎలాగో ఎవరూ ఉండలేరు" అనే రకుల్ డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా విదేశాల్లోనే చిత్రీకరించబడిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
Nagarjuna
Rakul
lakshmi

More Telugu News