East Godavari District: జషిత్ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్నా: నారా లోకేశ్

  • జషిత్ నానమ్మపై దాడి దారుణం
  • ప్రభుత్వం వీలైనంత త్వరగా జషిత్ ఆచూకీ కనిపెట్టాలి
  • చిన్నారి తల్లిదండ్రుల ఆవేదనను తీర్చాలి
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో చిన్నారి జషిత్ అపహరణకు గురైన విషయం తెలిసిందే. అపహరణకు గురైన బాలుడు క్షేమంగా తిరిగి రావాలని టీడీపీ నేత నారా లోకేశ్ కోరారు. మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన జషిత్ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.

జషిత్ నానమ్మపై దాడి చేసి, ఆమె చేతుల్లో నుంచి బాబును తీసుకెళ్ళడం దారుణమని, ప్రభుత్వం వీలైనంత త్వరగా జషిత్ ఆచూకీ కనిపెట్టాలని, చిన్నారి తల్లిదండ్రుల ఆవేదనను తీర్చాలని కోరారు. కాగా, బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ లో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
East Godavari District
Mandapet
Telugudesam
Nara lokesh

More Telugu News