YSRCP: ఇలా ఊరికి ఒక రాజ భవనం, ప్రతి రాజ భవనానికి ఒక జీఓ ఇస్తాం: సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత మరోమారు విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఈసారి జగన్ నివాసాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని జగన్ నివాసానికి సెక్యూరిటీ నిమిత్తం రూ.24 లక్షల ఖర్చు అంటూ ఓ ఆంగ్ల ఛానెల్ లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ స్క్రీన్ షాట్ ను లోకేశ్ పోస్ట్ చేశారు. ‘ఇప్పుడే ఏమైంది, బెంగుళూరు ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, కడపలో గెస్ట్ హౌస్, పులివెందులలో భవంతి, ఇలా ఊరికి ఒక రాజ భవనం, ప్రతి రాజ భవనానికి ఒక జీఓ ఇస్తాం’ అంటూ సెటైర్లు గుప్పించారు. 
Go Back to Shorts
YSRCP
jagan
cm
Telugudesam
Nara Lokesh
AP

More Telugu News