Tractor Drivers: ట్రాక్టర్ డ్రైవర్లకు, కూలీలకు మధ్య ఘర్షణ.. ఒకరిపై మరొకరు దాడి

  • క్వారీలో చోటు చేసుకున్న వివాదం
  • ట్రాక్టర్లను రోడ్డుపైనే అడ్డుకున్న కూలీలు
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
ఓ క్వారీలో ట్రాక్టర్ల డ్రైవర్లు, కూలీలకు మధ్య చోటు చేసుకున్న వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలం, నార్త్ వల్లూరు క్వారీలో ట్రాక్టర్ డ్రైవర్లు, కూలీల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. దీంతో క్వారీ పనులను నిలిపివేసిన కూలీలు ట్రాక్టర్లను రోడ్డుపైనే అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
Tractor Drivers
Krishna District
Thotlavllore
Attack
Police

More Telugu News