Andhra Pradesh: మెగాస్టార్ చిరంజీవితో సమావేశమైన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్!

  • సైరా షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు
  • పలు అంశాలపై చర్చించామన్న మనోహర్
  • చిరంజీవి ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది
మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని ఆయన సోదరుడు పవన్ కల్యాణ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలుసుకున్నారు. హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్, మనోహర్ చిరంజీవితో భేటీ అయ్యారు.

ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నాదెండ్ల మనోహర్..‘పవన్ కల్యాణ్ గారు, నేను సైరా నరసింహారెడ్డి(చిరంజీవి గారి)ని  కలుసుకున్నాం. ఈ సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ భేటీలో మేం చాలా అంశాలపై చర్చించాం. ఆయన జీవిత ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. చిరంజీవిగారు మరిన్ని విజయాలు సాధించాలని, ఇలాంటి సమావేశాలు మళ్లీమళ్లీ జరగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chiranjeevi
Pawan Kalyan
NANDENDLA MANOHAR

More Telugu News