మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్: మంత్రి జయరాం
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్ అంటూ ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రశంసించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఈరోజు ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ, సీఎం జగన్ అందరికీ న్యాయం చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీ లలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తామని చెప్పారు. చంద్రబాబు తన హయాంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.