Priya Raman: బీజేపీలో చేరిన సినీ నటి ప్రియారామన్

  • సత్యమూర్తి సమక్షంలో బీజేపీలో చేరిక
  • సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న ప్రియారామన్
  • తనకు పదవులు ముఖ్యం కాదంటూ వ్యాఖ్య
సినీ నటి ప్రియారామన్ బీజేపీలో చేరారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియారామన్ మాట్లాడుతూ, సమాజసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పదవులు తనకు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. రాజకీయాలలో ప్రధాని మోదీ తన రోల్ మోడల్ అని చెప్పారు. ప్రియారామన్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించారు.
Priya Raman
Actress
Tollywood
BJP

More Telugu News