new governor: ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం

  • ప్రమాణం చేయించిన హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌
  • హాజరైన ముఖ్యమంత్రి జగన్‌, విపక్ష నేత చంద్రబాబు
  • నరసింహన్‌ స్థానంలో ఇటీవల నియమితులైన ఒడిశా నేత
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన ఒడిశా సీనియర్‌ బీజేపీ నేత బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈరోజు ఉదయం 11.35 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బిశ్వభూషణ్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌నే ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల బాధ్యతలు చూసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇటీవల బిశ్వభూషణ్‌ నియమితులయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
new governor
teke owth
rajbhavan

More Telugu News