పశ్చిమగోదావరిలో పొలంలోకి దూసుకెళ్లి పల్టీకొట్టిన ప్రైవేటు స్కూలు బస్సు!
- పశ్చిమగోదావరిలోని తణుకులో ఘటన
- ప్రమాద సమయంలో బస్సులో 34 మంది విద్యార్థులు
- విద్యార్థులను కాపాడిన రైతులు
కాగా, ఈ ఘటనలో చిన్నారులకు స్వల్ప గాయాలు అయ్యాయని, వారికి ప్రథమ చికిత్స అందించి ఇళ్లకు పంపించివేసినట్లు స్థానిక డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు స్కూలు బస్సుతో పాటు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? డ్రైవింగ్ సమయంలో ఆయన మద్యం సేవించి వున్నాడా? అనేవి ఇంకా తెలియాల్సి ఉంది.