Jagan: ప్రతి విషయాన్ని అడ్డుకుంటున్నారు: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

  • రైతులకు పెట్టుబడి సాయం అందించబోతున్నాం
  • ప్రజలకు మంచి చేయాలనే తపన చంద్రబాబుకు లేదు
  • సభలో చర్చ జరపాలనే ఉద్దేశం కూడా లేదు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రతి అంశాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోను తాము ప్రవిత్ర గ్రంథంగా చూస్తున్నామని... మేనిఫెస్టోను చూసే ప్రజలు తమను గెలిపించారని చెప్పారు. రబీలో రైతులను ఆదుకోవడానికి అక్టోబర్ లో పెట్టుబడి సాయం అందించాలనుకుంటున్నామని తెలిపారు. మంచి పని చేస్తున్న తమను అభినందించాల్సింది పోయి... తమ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలనే తపన చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. సభలో అర్థవంతమైన చర్చ జరపాలనే ఉద్దేశం టీడీపీకి లేదని అన్నారు.
Jagan
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News