assembly: చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని టీడీపీ నిరసన.. శాసన సభ నుంచి వాకౌట్‌

షార్ట్స్‌లో చూడండి
శాసన సభ సమావేశాల నుంచి విపక్ష తెలుగుదేశం పార్టీ వాకౌట్‌ చేసింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే  చంద్రబాబు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభంకాగానే చంద్రబాబునాయుడుకు మైక్‌ ఇవ్వాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇందుకు స్పీకర్‌ అనుమతించక పోవడంతో వారంతా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సభ కూడా వాయిదా పడింది. ఏపీ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి సభ ప్రారంభమవుతుందని స్పీకర్‌ ప్రకటించారు.
Go Back to Shorts
assembly
Telugudesam
Chandrababu
walkout

More Telugu News