Bollywood: రెండు అరటిపళ్ల ధర రూ.442.. విస్తుపోయిన బాలీవుడ్ హీరో రాహుల్ బోస్!

  • ఫైవ్‌స్టార్ హోటల్‌లో రాహుల్‌కు చేదు అనుభవం
  • సోషల్ మీడియాలో షేర్ చేసిన నటుడు
  • అరటిపండ్లు కూడా ఆరోగ్యానికి హానికరమేనంటూ ట్వీట్  
మీరు చదివింది నిజమే. ఆ అరటిపండ్లేమీ దేవలోకం నుంచి ఊడిపడలేదు. అలాగని వాటికి ఏ ప్రత్యేకతా లేదు. అయినా వాటి ధర 442.50 రూపాయలట. అది రెండింటి ధర మాత్రమే. అంటే ఒక్కో అరటిపండు 221.25 రూపాయలన్నమాట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విన్నమనకే కాదు.. వాటి ధర చూసిన బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌ కూడా షాకయ్యాడు.

 షూటింగ్ నిమిత్తం చండీగఢ్ వెళ్లిన రాహుల్.. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశాడు. జిమ్‌కు వెళ్లొచ్చి రెండు అరటి పండ్లకు ఆర్డర్ ఇచ్చాడు. పండ్లతోపాటు వచ్చిన బిల్లు చూసి నోరెళ్లబెట్టాడు. వాటిపై ఏకంగా రూ.442.50 బిల్లుండడంతో మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. కాసేపటి తర్వాత తేరుకుని బిల్లును పరిశీలిస్తే సెంట్రల్ జీఎస్టీ కింద రూ.33.75, యూటీ జీఎస్టీ కింద మరో రూ.33.75 వేసి మొత్తం బిల్లును రూ.442.50గా చూపించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రాహుల్.. అరటిపండ్లు కూడా ఆరోగ్యానికి హానికరమేనని ట్వీట్ చేశాడు.
Bollywood
Rahul bose
Banana
fivestar hotel

More Telugu News