Brazil: మతబోధకుడిని అమాంతం కిందికి తోసేసిన మహిళ.. 50 వేల మంది షాక్!

  • లావుగా ఉన్నవారు స్వర్గానికి వెళ్లరన్న మత గురువు
  • ఆగ్రహంతో వేదిక పైనుంచి కిందికి తోసేసిన మహిళ
  • ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతోందన్న స్నేహితులు
బ్రెజిల్‌లో ఈ నెలలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వేదికపై ప్రసంగిస్తున్న మత గురువును లావుగా ఉన్న ఓ మహిళ అమాంతం కిందికి నెట్టేసింది. ఆయన బోధనలు వింటున్న 50 వేలమంది ఈ ఘటనతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.

ఇంతకీ, మత గురువును ఆమె ఎందుకలా తోసిందంటే.. ఆయన తన బోధనల్లో లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్లరని చెప్పాడట. అంతే.. ఆగ్రహంతో వేదికపైకి వచ్చిన మహిళ వెనకి నుంచి వచ్చి అమాంతం కిందికి తోసేసింది. నిందితురాలైన మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, అందుకే అలా చేసి ఉంటుందని ఆమె స్నేహితులు పేర్కొన్నారు. ఘటన తర్వాత పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నప్పటికీ బాధిత మత గురువు ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెను విడిచిపెట్టారు.  
Brazil
priest
shock
Viral Videos

More Telugu News