Karnataka: సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంపై కర్ణాటక కాంగ్రెస్ స్పందన!

  • చెడు సాధించిన విజయం తాత్కాలికమే
  • అంతిమంగా గెలిచేది సత్యం, ప్రజాస్వామ్యమే 
  • ఇన్నాళ్లూ ప్రజలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు
విశ్వాసపరీక్షలో బల నిరూపణ చేసుకోలేకపోయిన జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ కుప్పకూలిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. చెడు సాధించిన విజయం తాత్కాలికమేనని, అంతిమంగా సత్యం, ప్రజాస్వామ్యమే గెలుస్తుందని పేర్కొంది. ప్రజా తీర్పును అపహాస్యంపాలు చేసేలా ఉన్న అవినీతి విధానాలను కూకటివేళ్లతో సహా పెకిలించి వేసేందుకు తాము కట్టుబడిఉన్నామని, ఇన్నాళ్లూ ప్రజలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపింది.   
Karnataka
congress
jds
bjp

More Telugu News