Karnataka: కర్ణాటకలో అభివృద్ధికి నాంది పలుకుతాం: బీజేపీ నేత యడ్యూరప్ప

  • ఇది ప్రజాస్వామ్య విజయం
  • కరవు కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు
  • రైతులకు మరింత ప్రాధాన్యమిస్తాం
కర్ణాటకలో అభివృద్ధికి నాంది పలుకుతామని బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక విధానసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలింది. అనంతరం, విధాన సభ ప్రాంగణంలో మీడియాతో యడ్యూరప్ప మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. కర్ణాటకలో అభివృద్ధికి నాంది పలుకుతామని చెప్పారు. రాష్ట్రంలో కరవు కారణంగా రైతులు పలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతులకు మరింత ప్రాధాన్యమిస్తామని, వీలైనంత త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Karnataka
congress
jds
bjp
yedurappa

More Telugu News