Kumara Swamy: కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామాను సమర్పించనున్న కుమారస్వామి

షార్ట్స్‌లో చూడండి
సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను మరిపించిన కర్ణాటక రాజకీయానికి నేటితో తెరపడింది. కర్ణాటకలో 105 - 99 ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. నేడు జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. దీంతో కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వాజూభాయ్ వాలాకు రాజీనామాను అందించనున్నారు. ఓటమి అనంతరం ప్రభుత్వ సదుపాయాలన్నీ ఆయన వదులుకుని కాలినడకన వెళ్లేందుకు సిద్ధపడ్డారు.  
Go Back to Shorts
Kumara Swamy
Karnataka
Congress
JDS
Rajbhavan
Vajubhai wala

More Telugu News