Ram Charan: చెర్రీ బాగానే ఉన్నాడు.. గాయాలేమీ కాలేదు: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం

షార్ట్స్‌లో చూడండి
షూటింగులో భాగంగా కథానాయకుడు రామ్ చరణ్ మరోసారి గాయపడ్డాడని ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో ఉన్న చెర్రీ గతంలో చిత్రీకరణలో భాగంగా కాలికి గాయమైంది. అయితే నేడు ఆయన ఓ సన్నివేశం ప్రాక్టీస్ సందర్భంగా ప్రమాదవశాత్తు మరోసారి గాయపడ్డాడని కొన్ని వెబ్‌సైట్లు వార్తా కథనాలను రాశాయి.

దీంతో చిత్రబృందం ఈ వార్తలపై స్పందించింది. చెర్రీ ఆరోగ్యం చాలా బాగుందని, ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం స్పష్టం చేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీతో పాటు మరో కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. 2020 జులై 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Go Back to Shorts
Ram Charan
Rajamouli
Junior NTR
Websites
RRR

More Telugu News