Narendra Modi: పార్లమెంటులో పసిబిడ్డను లాలించిన ప్రధాని మోదీ... ఫొటోలు వైరల్

  • మనవడితో పార్లమెంటుకు వచ్చిన బీజేపీ ఎంపీ
  • చిన్నారి కేరింతలకు మురిసిపోయిన మోదీ
  • సోషల్ మీడియాలో ఫొటోలకు విపరీతమైన స్పందన
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ఓ అనుకోని అతిథిని కలిసి ఆనంద పారవశ్యంలో మునిగితేలారు. బీజేపీ ఎంపీ సత్యనారాయణ్ జతియా తన మనవడితో కలిసి పార్లమెంటుకు వచ్చారు. ఆయన మోదీని కలిసిన సమయంలో చిన్నారి కూడా వెంటే ఉండడంతో ఎవరీ చిన్నారి? అంటూ ఆరా తీసిన మోదీ ఆపై చేతులు చాచి ఆహ్వానించారు.

తన చేతుల్లోకి వచ్చిన ఆ పసిబిడ్డను మోదీ కాసేపు ఆడించడమే కాదు, ఆ చిన్నారి తన చేతుల్లో కేరింతలు కొడుతుంటే మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ప్రధాని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ ఫొటోలు పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే భారీ స్పందన కనిపించింది. కొద్ది వ్యవధిలోనే నెటిజన్లు లైకులు, షేర్లతో హోరెత్తించారు.
Narendra Modi
Baby
Parliament

More Telugu News