Andhra Pradesh: బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి అమరావతిని భ్రష్టుపట్టించారు: వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం
- అమరావతి అభివృద్ధికి మా హయాంలో కష్టపడ్డాం
- బంగారు గుడ్డు పెట్టే బాతులా తయారయ్యేది
- ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా పోయింది
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి తమ హయాంలో కష్టపడ్డామని, బంగారు గుడ్డు పెట్టే బాతులా తయారు అయ్యేదాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా పోయిందని, ఈ రాష్ట్రానికి ఎవరైనా రావాలంటే భయపడే పరిస్థితికి వస్తున్నారని విమర్శించారు.