Karnataka: సభలో జరిగిన పరిణామాలతో నా రక్తం మరిగిపోయింది: కర్ణాటక స్పీకర్ రమేశ్

  • కనీస సభా సంప్రదాయాలు పాటించలేదు
  •  రాజ్యాంగ బద్ధంగా నా పని నేను నిర్వర్తించా
  • రాజ్యాంగ ప్రమాణాల మేరకే సభను నిర్వహించా
కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు ముందు స్పీకర్ రమేశ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. సభలో జరిగిన పరిణామాలతో తన రక్తం మరిగిపోయిందని అన్నారు. కనీస సభాసంప్రదాయాలు పాటించకుండా ఇబ్బంది పెట్టారని, స్పీకర్ పదవిలో రాజ్యాంగ బద్ధంగా తన పని తాను నిర్వర్తించానని, రాజ్యాంగ ప్రమాణాల మేరకే సభను నిర్వహించానని చెప్పారు. కాగా, స్పీకర్ రమేశ్ తన రాజీనామా పత్రంతో సభకు హాజరయ్యారు. తన రాజీనామా పత్రాన్ని సభ్యులకు చూపించారు. ఆ తర్వాత ఈ పత్రాన్ని సిబ్బంది ద్వారా యడ్యూరప్పకు పంపారు.  
Karnataka
bjp
congress
jds
speaker

More Telugu News