Jagan: త్వరలో ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన... ముందు జెరూసలెం, ఆ తర్వాతే అమెరికా!
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. త్వరలో కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలో పర్యటించనున్నారు. అయితే, అమెరికా వెళ్లేముందు జెరూసలెం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఏటా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన జెరూసలెం వెళ్లడం జగన్ కుటుంబానికి ఆనవాయితీ. ఈ క్రమంలో జగన్, కుటుంబంతో కలిసి ఆగస్టు 1న జెరూసలెం వెళ్లి అక్కడ 5 రోజుల పాటు పర్యటిస్తారు. ఆపై తిరిగి అమరావతి చేరుకుంటారు. మరలా, ఆగస్టు 17న అమెరికా చేరుకుని 23వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభతో పాటు డల్లాస్ లోని కే బెల్లే కన్వెన్షన్ సెంటర్ లో ఎన్నారైలు నిర్వహించే భారీ సభకు హాజరవుతారు.