KVR Mahendra: నేను కథ చెప్పగానే సాయిచంద్ ఏడ్చేశారు: 'దొరసాని' దర్శకుడు కేవీఆర్ మహేంద్ర

  • నక్సలైట్ పాత్ర కోసం సాయిచంద్ ను అనుకున్నాను
  • 'శంకరన్న' పాత్ర ఆయనకి బాగా నచ్చింది
  • 'సైరా' షూటింగుతో సాయిచంద్ బిజీ అని చెప్పిన మహేంద్ర
ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'దొరసాని' మంచి మార్కులు కొట్టేసింది. దర్శకుడిగా ఈ సినిమా కేవీఆర్ మహేంద్రకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

'దొరసాని' సినిమాలో నక్సలైట్ నాయకుడి పాత్రను కన్నడ కిషోర్ చేశారు. తెలంగాణ యాసలో మాట్లాడవలసిన ఈ పాత్రకి ముందుగా సాయిచంద్ ను అనుకున్నాము. నేను కథ చెప్పగానే సాయిచంద్ ఏడ్చేశారు. ఈ పాత్రను చేయడానికి ఆయన ఎంతో ఆసక్తిని చూపించారు. కానీ ఆ సమయంలో ఆయన 'సైరా' సినిమా షూటింగుతో బిజీగా వున్నారు. ఎంతగా ప్రత్నించినా డేట్స్ కుదరలేదు. అందువలన కన్నడ కిషోర్ ను తీసుకోవలసి వచ్చింది. తెలంగాణ యాసతో డైలాగ్స్ చెప్పడానికి తను చాలా కసరత్తు చేశారు" అని చెప్పుకొచ్చాడు. 
KVR Mahendra

More Telugu News