Jagan: ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మోసం చేశారు: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. 46 ఏళ్లకి జగన్ గారికి ఉద్యోగం వచ్చిందని... నవరత్నాల్లోని 45 ఏళ్లకు పెన్షన్ రత్నం మాత్రం మాయమైందని ఆయన ఎద్దేవా చేశారు. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు... మీరు కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు... ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి, వారిని మోసం చేశారని విమర్శించారు.

జగన్ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో మహిళకు పెన్షన్ రూపంలో లక్షా 20వేల రూపాయలు ఇవ్వాలని లోకేశ్ చెప్పారు. మడమ తిప్పడం, మాట తప్పడం ద్వారా ఒక్కో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకు రూ. 45 వేల నష్టం కలుగుతుందని అన్నారు. పెనం పైన దోశను తిప్పుతున్న వీడియోను కూడా అప్ లోడ్ చేశారు.
Go Back to Shorts
Jagan
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News