Telugudesam: టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం!

  • అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
  • డిప్యూటీ స్పీకర్ తో బుగ్గన, శ్రీకాంత్ రెడ్డి భేటీ
  • సస్పెన్షన్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ తో శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం టీడీపీ సభ్యులను డిప్యూటీ స్పీకర్ మరోసారి చర్చలకు పిలిచారు. కాసేపట్లో సస్పెన్షన్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Telugudesam
YSRCP
Andhra Pradesh
Assembly

More Telugu News