Smita: నాకు పొగరెక్కువ అనుకుంటే పొరపాటే: సింగర్ స్మిత

  • అవకాశాల కోసం తిరిగే అలవాటు లేదు
  • ఎదుటివారి ప్రవర్తనను బట్టి గౌరవిస్తాను
  •  నాకు మొహమాటమెక్కువన్న స్మిత  
తెలుగు గాయనీలలో స్మిత స్థానం ప్రత్యేకం. ఆమె వాయిస్ లోని కొత్తదనం కారణంగా, ఆమె చేసిన ఆల్బమ్స్ కి విపరీతమైన ఆదరణ లభించింది. అప్పట్లో హిట్ సినిమా పాటలతో పోటీపడి ఆమె కేసెట్లు .. సీడీలు అమ్ముడయ్యేవి. అంతటి పాప్యులర్ అయిన స్మిత, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తన కెరియర్ ను గురించి ప్రస్తావించింది. తనకి పొగరెక్కువని జరుగుతున్న ప్రచారాన్ని గురించి స్పందించింది.

"నేను ఎవరి దగ్గరికి అవకాశాల కోసం వెళ్లను. అవకాశం ఇవ్వమని అడగడానికి నాకు మొహమాటం. దానిని అవతల వాళ్లు పొగరు అనుకుంటే నేనేం చేయలేను. వయసును బట్టి కాకుండా ఎదుటివారి ప్రవర్తనను బట్టి నేను గౌరవిస్తాను. సాధ్యమైనంత వరకూ తగ్గే వుంటాను .. ఎదుటి వాళ్ల ప్రవర్తన సరిగ్గా లేకపోతే మాత్రం అందుకు తగినట్టుగానే వుంటాను. నా గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం ఈ ప్రచారాన్ని పట్టించుకోరు" అని చెప్పుకొచ్చింది. 
Smita
Ali

More Telugu News