Nara Lokesh: వారెవా... రాజన్న రాజ్యం: నారా లోకేశ్

  • రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇది
  • ఎమ్మెల్యేలను మార్షల్స్ తీసుకెళుతున్న చిత్రాలను పోస్ట్ చేసిన లోకేశ్
  • ఈ ఉదయం ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ 
ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు శాసన సభ్యులను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తరలిస్తున్న చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన లోకేశ్, "వారెవా.. ప్రజల పక్షాన నిలిస్తే..  రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ.. !" అని వ్యాఖ్యానించారు. కాగా, సభా కార్యక్రమాలకు నిత్యమూ అడ్డుపడుతున్నారన్న కారణంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చెయ్య చౌదరిలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. 
Nara Lokesh
Twitter
Telugudesam

More Telugu News