Vijay Devarakonda: తమిళనాట గట్టిపోటీని ఎదుర్కోనున్న 'డియర్ కామ్రేడ్'

  • ఈ నెల 26న థియేటర్లకు 'డియర్ కామ్రేడ్'
  • తెలుగులో సోలో రిలీజ్ 
  • తమిళనాట 6 సినిమాలతో పోటీ  
విజయ్ దేవరకొండ అభిమానులంతా ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా, సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో విడుదలవుతోంది. తెలుగులో ఈ సినిమాకి పోటీలేదు. కానీ తమిళనాట మాత్రం గట్టిపోటీ కనిపిస్తోంది.

అదే రోజున అక్కడ 'కొలైయుధీర్ కాలం' .. 'ఏ1' .. 'కొలాంజి' .. 'ఆరడి' .. 'నుంగం బాకం' .. 'చెన్నై పళని మార్స్' సినిమాలు థియేటర్స్ కి వస్తున్నాయి. నయనతార ప్రధాన పాత్రగా 'కొలైయుధీర్ కాలం' .. సంతానం హీరోగా 'ఏ1' వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు మరింత గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన ఈ సినిమాలో, శ్రుతి రామచంద్రన్ .. చారుహాసన్ .. సుహాస్ ..  ఆనంద్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Vijay Devarakonda

More Telugu News