Shatrughna Sinha: ప్రియాంకా గాంధీ రావాల్సిందే: శత్రుఘ్నసిన్హా

  • ప్రియాంక తెగువ, ధైర్యం అద్భుతం
  • ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చారు
  • అధ్యక్ష పదవిని చేపట్టాలన్న సిన్హా
గత వారంలో యూపీలో హత్యకు గురైన గిరిజన రైతులను పరామర్శించేందుకు వెళ్లి, అరెస్టయిన ప్రియాంకా గాంధీని ఆ పార్టీ నేత, సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా పొగడ్తల్లో ముంచెత్తారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో, తదుపరి పార్టీ అధ్యక్ష పదవి ఆమెనే చేపట్టాలని, కాంగ్రెస్ కు ప్రియాంక నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు.

పార్టీ అత్యున్నత పదవిలో ప్రియాంక గాంధీ అయితేనే ఒదిగిపోతారని అభిప్రాయపడ్డ ఆయన, బాధితులను పరామర్శించే విషయంలో ప్రియాంక చూపిన తెగువ అత్యంత ప్రశంసనీయమన్నారు. సమస్యలపై పోరాడే విషయంలో ఆమె దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో సమానంగా నిలిచారని అన్నారు. ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేసిన ఆయన, పార్టీని ముందుకు నడిపించే సామర్థ్యం ఆమెలో పుష్కలమని సిన్హా అన్నారు.
Shatrughna Sinha
Priyaanka Gandhi
Congress

More Telugu News