Jagan: మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నా జీవితంలో చేయలేదు: వైఎస్ జగన్

  • ఏం హామీలిచ్చానో అదే చేస్తున్నా
  • ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
  • అసెంబ్లీలో హామీల వీడియో చూపిన జగన్
అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం వంటి పనులు తన జీవితంలో ఎన్నడూ చేయలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, తాను ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పానో, పాదయాత్రలో ప్రజలకు ఏం హామీలను ఇచ్చానో వాటినే నెరవేరుస్తున్నానని స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో సందేహం అక్కర్లేదంటూ, అక్క చెల్లెళ్లకు తాను పాదయాత్రలో ఇచ్చిన హామీల వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు.

ఈ సమయంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం చూపిన వీడియోలను తాము చూశామని, తాము ఇచ్చే వీడియోను కూడా ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. వైసీపీ మేనిఫెస్టోపై ఇరుపక్షాల మధ్యా వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో, టీడీపీ 600 హామీలను ఇచ్చిందని, వాటిల్లో ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదని అధికారపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు.
Jagan
Andhra Pradesh
Assembly

More Telugu News