American Tennis Player: తన పెళ్లిలో కత్రినాకైఫ్ పాటకు డ్యాన్స్‌ చేసిన అమెరికన్ టెన్నిస్ స్టార్.. వీడియో వైరల్!

  • ఆనంద్ అమృత్‌రాజ్ కుమారుడు స్టీఫెన్‌ను పెళ్లాడిన అలిసన్
  • బార్‌బార్ దేఖో సినిమాలోని పాటకు స్టెప్పులేసి అలరించిన టెన్సిస్ స్టార్ 
  • శుభాకాంక్షలు చెప్పిన సానియా మీర్జా
అమెరికన్ టెన్నిస్ స్టార్ అలిసన్ రిస్కే (29) డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. వింబుల్డన్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆష్టీ బార్టీని మట్టికరిపించిన రిస్కె.. డేవిడ్ కప్ మాజీ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ కుమారుడు స్టీఫెన్ అమృత్‌రాజ్‌ (35)ను పెళ్లాడింది. వివాహ వేడుకలో రిస్కే చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బాలీవుడ్ సినిమా ‘బార్‌ బార్ దేఖో’లోని ‘నాచ్‌దే సారే’ పాటకు అలీసన్ స్టెప్పులతో ఇరగదీసింది. సినిమాలో కత్రినా కైఫ్ చేసిన డ్యాన్స్‌ను అనుకరించింది. అలిసన్ సోదరి సారా కూడా ఆమెతో కాలుకదపడంతో పిట్స్‌బర్గ్‌లోని పెళ్లి వేడుక కేరింతలతో మార్మోగిపోయింది. కాగా, అలిసన్‌-స్టీఫెన్ జంటకు భారత టెన్సిస్ దిగ్గజం సానియా మీర్జా శుభాకాంక్షలు తెలిపింది.
American Tennis Player
Alison Riske
Stephen Amritraj
wedding

More Telugu News