East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో కాలువలో పడిన బైక్.. ఇద్దరి మృతి

  • గుడిమెల్లంక వద్ద కాలువలోకి దూసుకెళ్లిన బైక్
  • బాధితులను యలమంచిలి మండలం కాజకు చెందిన వారిగా గుర్తింపు
  • గల్లంతైన నాలుగేళ్ల చిన్నారి కోసం గాలింపు
ప్రమాదవశాత్తు కాల్వలోకి బైక్ దూసుకెళ్లిన ఘటనలో ఓ చిన్నారి, మరో యువతి ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి గల్లంతైంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని గుడిమెల్లంక వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి బయటపడిన బాధితుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజకు చెందిన కుటుంబం బైక్‌పై సిఖినేటిపల్లి మండలంలోని పెదలంకలో ఉన్న నాటువైద్యుడి వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గుడిమెల్లంక వద్దకు చేరుకోగానే బైక్ అదుపుతప్పి పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్గవి అనే ఐదేళ్ల చిన్నారితోపాటు కృప అనే మరో యువతి ప్రాణాలు కోల్పోయింది. కిరణ్మయి అనే నాలుగేళ్ల చిన్నారి గల్లంతైంది. చిన్నారుల తల్లి సుగుణ, మేనమామ బ్రహ్మాజీలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బైక్‌పై సామర్థ్యానికి మించి ప్రయాణిస్తుండడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన చిన్నారి కోసం గాలిస్తున్నారు.  
East Godavari District
Rajahmundry
bike accident
Gudimellanka

More Telugu News