Haryana: కర్రను మైక్‌లా పట్టుకుని రిపోర్టింగ్ అదరగొట్టిన చిన్నారి.. వీడియో వైరల్

షార్ట్స్‌లో చూడండి
హరియాణాలో ఓ చిన్నారి తల పండిన పాత్రికేయుల్నే తలదన్నేలా రిపోర్టింగ్ చేసింది. ఈ చిన్నారి చేసిన రిపోర్టింగ్ తాలుకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని కురుక్షేత్ర సహా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయి నడిచేందుకు తీవ్ర ఇబ్బందికరంగా రోడ్లు తయారయ్యాయి. ఇళ్లల్లోకి సైతం నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఓ చిన్నారి దీనిపై రిపోర్టింగ్ చేసింది. కర్రను మైక్‌లా పట్టుకుని హిందీలో ఎడపెడా దంచేసింది. నీరు చాలా వేగంగా ప్రవహిస్తోందని, ఓ ఇంటిని చూపిస్తూ అది నీటితో ఎలా నిండిపోయిందో చూడాలని తెలిపింది. ఆ ఇంట్లో నీరు రాకుండా వారు పడుతున్న కష్టాలను చూడండంటూ అద్భుతంగా రిపోర్టింగ్ చేసింది. దీన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు చిన్నారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


Go Back to Shorts
Haryana
Madhya Pradesh
Reporting
Social Media
HIndi

More Telugu News