amaravathi: అమరావతి దెబ్బతింది.. పెట్టుబడిదారులు హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారు: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
అమరావతి నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టకుండా ఉన్న ప్రాజెక్టును నడిపిస్తే చాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజున అమరావతి దెబ్బతింది కనుక, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు, వేరే రాష్ట్రాల రాజధానులకు పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారని అన్నారు.

ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ల్యాండ్ విలువ పెరుగుతోందని, ఇక్కడ మాత్రం పడిపోతోందని అభిప్రాయపడ్డారు. ‘దీనికి ఎవరు కారణం? మీరు కాదా? ఎందుకు ఇంత దుర్మార్గమైన పని చేస్తారు? ఇంత అరాచకానికి తావిస్తున్నారు? ఇందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను మాత్రం వైసీపీ ప్రభుత్వం తీసుకోదట, తెలంగాణకు మాత్రం నీళ్లు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తోందని మండిపడ్డారు.
Go Back to Shorts
amaravathi
Telugudesam
Chandrababu
cm
jagan

More Telugu News