Prahsant Kishore: మీడియా వర్గాలకు హితవు పలికిన ప్రశాంత్ కిశోర్

  • ఆదిత్య ఠాక్రేకు పీకే సలహాదారుగా వ్యవహరిస్తున్నారంటూ మీడియాలో వార్తలు
  • ఘాటుగా స్పందించిన ప్రశాంత్ కిశోర్
  • తాను ఎవరివద్ద పనిచేస్తున్నానో మీడియాలో చూసి తెలుసుకుంటున్నానంటూ సెటైర్
జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు కోపం వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ప్రశాంత్ కిశోర్ రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. 'జన్ ఆశీర్వాద్ యాత్ర'తో ప్రజల్లోకి వెళ్లాలంటూ సలహా ఇచ్చింది కూడా ప్రశాంత్ కిశోరేనంటూ ప్రచారం జరిగింది.

దీనిపై ప్రశాంత్ కిశోర్ ఘాటుగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే  వార్తలు ఇవ్వాలని మీడియాకు హితవు పలికారు. తాను ప్రస్తుతం ఎవరి దగ్గర పనిచేస్తున్నానో మీడియాలో వార్తలు చూసిన తర్వాతే తెలుసుకుంటున్నానని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ తరహా వైఖరి విచారించదగ్గ విషయమని ట్వీట్ చేశారు.
Prahsant Kishore
Media

More Telugu News