Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ.. పలు కీలక అంశాలపై సమాధానాలు రాబట్టే యత్నం

  • మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు కేసు
  • ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ
  • విదేశాలకు నగదు తరలింపుపై ఆరా
2007లో గనుల అక్రమాల విషయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి భారీగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. పలు కీలక అంశాలపై అధికారులు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు నగదు తరలించడంపై అధికారులు జనార్దన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
Gali Janardhan Reddy
CBI
Basheerbagh
Enforcement Directorate
Karnataka
Money Landering

More Telugu News