Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' కోసం కొండా రెడ్డి బురుజు సెట్

  • షూటింగు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
  • 4 కోట్ల ఖర్చుతో భారీ సెట్ 
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన 
మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై కొన్ని సన్నివేశాలను కశ్మీర్ లోను చిత్రీకరించారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ వేస్తున్నారు. కర్నూల్ - కొండారెడ్డి బురుజు, ఆ పరిసర వీధులకు సంబంధించిన సెట్ ను వేస్తున్నారు.

సెట్ అవసరం లేదని మొదట అనుకున్నప్పటికీ, ఆ తరువాత అసలు లొకేషన్ లో షూటింగ్ జరపడంలోని సమస్యలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ సెట్ కోసం 4 కోట్లకి పైగా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక అన్నపూర్ణ స్టూడియోలో ట్రైన్ సెట్ ను .. విజయశాంతి ఇంటి కోసం ఒక సెట్ ను వేస్తున్నారు. భారీ సెట్లలో చకచకా షూటింగును కానిచ్చేసి, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Mahesh Babu
Rashmika

More Telugu News