Chandrababu: వైసీపీ సాగిస్తున్న ఈ మారణహోమానికి అంతమెప్పుడు?: చంద్రబాబు

  • ఆశా వర్కర్ పై వేధింపులతో ఆత్మహత్యాయత్నం  
  • ఎన్నాళ్లీ అరాచకాలు సాగిస్తారు?
  • ఇది ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా?
ఏపీలో టీడీపీ కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులపై వైసీపీ చేస్తున్న దాడులను సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఆశా వర్కర్ వెంకటరమణమ్మ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. టీడీపీ మద్దతుదారులే లక్ష్యంగా వైసీపీ సాగిస్తున్న మారణహోమానికి అంతమెప్పుడు? అని ప్రశ్నిస్తూ చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు.

 నెల్లూరు జిల్లాలోని సంగం గ్రామంలో పద్నాలుగేళ్లుగా ఆశా వర్కర్ గా ఆమె సేవలందిస్తున్నారని, ఆమెను వేధింపుల పాలు చేయడంతో మనస్తాపం చెంది, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అన్నారు. ఎన్నాళ్లీ అరాచకాలు సాగిస్తారు? ఇది ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా? అంటూ వైసీపీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. కాగా, బాధితురాలు వెంకటరమణమ్మకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న వీడియోను చంద్రబాబు జతపరిచారు.
Chandrababu
Telugudesam
YSRCP
cm
jagan

More Telugu News