KIA Motors: జీతాలు తక్కువగా ఇస్తున్నారంటూ కియా ఉద్యోగుల ఆందోళన

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ అనుబంధ సంస్థ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీతం విషయంలో యాజమాన్యం తమను మోసం చేస్తోందని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇస్తామన్న జీతాన్ని... విధుల్లో చేరిన తర్వాత ఇవ్వడం లేదని, తక్కువ జీతాన్ని ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదని మండిపడ్డారు. న్యాయం చేయాలని అడిగితే... మీ అవసరం లేదంటూ బయటకు పంపేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
KIA Motors
Employees
Protest

More Telugu News