Balakrishna: మాటమీద నిలబడే హీరో బాలకృష్ణ: పూరి జగన్నాథ్

  • చాలామంది హీరోలతో కలిసి పనిచేశాను 
  • బాలకృష్ణగారితో మరింత సన్నిహితంగా వుంటాను
  • దర్శకులకు ఆయన విలువ ఇస్తారన్న పూరి 
పూరి జగన్నాథ్ తాజా చిత్రంగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'కి మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఆయన ఫుల్ ఖుషీ అవుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బాలకృష్ణను గురించి ప్రస్తావించాడు.

 "చాలా మంది హీరోలతో సినిమాలు చేశాను. అందరితోను చనువుగానే వుంటాను .. కాకపోతే బాలకృష్ణగారితో మరింత సన్నిహితంగా వుంటాను. బాలకృష్ణగారు దర్శకులకు విలువ ఇస్తారు .. ఇచ్చిన మాటకి కట్టుబడి వుంటారు. అందువల్లనే ఆయనని నేను ఎక్కువగా ఇష్టపడతాను. 'పైసా వసూల్' సినిమా నుంచి ఇప్పటి వరకూ ఆయనతో నా అనుబంధం అలా కొనసాగుతూనే వుంది. ఇక అభిమానులపై బాలకృష్ణ చేయి చేసుకుంటారనే విమర్శ వుంది. అభిమానుల పేరుతో మీద పడిపోయి విసిగించే వారిపై మాత్రమే ఆయన చేయి చేసుకుంటారు. ఆయన గురించి నాకు బాగా తెలుసు" అని చెప్పుకొచ్చాడు. 
Balakrishna
Puri Jagannadh

More Telugu News