Nagarjuna: బిగ్ బాస్ షో స్పందనపై నాగార్జున ట్వీట్

  • నిన్న ప్రారంభమైన మూడవ సీజన్
  • వరల్డ్ ట్రెండింగ్ లో నంబర్ వన్
  • ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన నాగ్
టాలీవుడ్ లో అతిపెద్ద బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ నిన్న రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమం హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ నూ పరిచయం చేసి, హౌస్ లోకి పంపించారు. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు వీక్షించారు. ఇక అదే విషయాన్ని ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావించిన నాగార్జున, గత రాత్రి, ప్రపంచంలోనే బిగ్ బాస్ తెలుగు స్టార్టింగ్ ఎపిసోడ్ నంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలని అన్నారు.
Nagarjuna
Biggboss
Tollywood
Telugu
Season 3

More Telugu News