Swarnalatha: తప్పనిసరిగా మీ కోరికలన్నీ తీరుతాయి: ఉజ్జయిని మహంకాళి రంగంలో భవిష్యవాణి
- రంగం వినిపించిన స్వర్ణలత
- పచ్చికుండపై నిలబడి అమ్మను ఆవహించుకున్న మాతంగి
- పలు ప్రశ్నలకు సమాధానాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జరిగిన రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వెల్లడించింది. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి, అమ్మవారిని తనలోకి ఆహ్వానించుకుని రంగం కార్యక్రమం నిర్వహించగా, దీన్ని చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సంవత్సరం పూజలు ఎంతో సంతృప్తికరంగా జరిగాయని, గత సంవత్సరం తాను కొంత బాధపడ్డానని, ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొంది.
ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరింది. తన అక్కచెల్లెళ్లు దూరంగా వెళ్లకుండా, తనకు దగ్గరగానే ఉండి పూజలు జరిపించాలని సూచించింది. భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆపదలూ రాకుండా చూసుకుంటానని, తనకు మారు బోనాన్ని తప్పకుండా ఇవ్వాలని అమ్మ సూచించింది. ఈ సంవత్సరం వర్షాలు బాగుంటాయని, రైతులకు మంచి పంటలు పండుతాయని, ప్రజల సంతోషమే తన సంతోషమని వెల్లడించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి అడిగిన పలు ప్రశ్నలకు అమ్మ తరఫున స్వర్ణలత సమాధానాలిచ్చింది.